(జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్ 11) బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసం సమీపాన అభిమానులు కృష్ణ, నవీన్, సాత్విక్, రాజు, ప్రసాద్, శ్రీను, మహేందర్ తదితరులు ఏర్పాటు చేసిన గణేష్ మండపంవద్ద బుధవారంనాడు అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని స్వామివారి నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అందరూ భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.