Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మండల కేంద్రంలోనే ఎంపీడీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి

*మండల కేంద్రంలోనే ఎంపీడీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి*

హన్మకొండ జిల్లా//ఐయినవోలు మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వర్ధన్నపేట ప్రతినిధి:-

హనుమకొండలో ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని అయినవోలు మండల కేంద్రాల్లోనికి మార్చి అక్కడ నుండే విధులు నిర్వహించాలని జఫర్గడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటాపురం గర్నెపెల్లి గ్రామాలను అయినవోలు పోలీస్ స్టేషన్కు మార్చాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హనుమకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చక్రపాణి లింగయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలోని ఎంపీడీవో ఆఫీసు నుండి విధులు నిర్వహిస్తున్నాయి కానీ అయినవోలు మండల ఎంపీడీవో కార్యాలయం హన్మకొండ లోని వడ్డేపల్లి నుండి నిర్వహించడం సరైంది కాదని ప్రజలు తమ అవసరాల కోసం 25 నుండి 30 కిలోమీటర్ల దూరం రావలసి వస్తుందని వారు అన్నారు మండలం ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నా ఎంపీడీవో కార్యాలయం హనుమకొండలో ఉండడం సరైనది కాదని అన్నారు వెంటనే ఎంపిడిఓ కార్యాలయాన్ని అయినవోలు మండల కేంద్రానికి మార్చాలని డిమాండ్ చేశారు. అయినవోలు మండలంలో ఉన్నవెంకటాపురం గర్నెపల్లి గ్రామాలు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జఫర్గడ్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం అక్కడికి ప్రజలు పోవాలంటే సరైన రవాణా మార్గం లేదని ఏదైనా ఘటన జరిగితే పోలీసు అధికారులు రావడానికి సుమారు 40 నిమిషాల నుండి గంట పడుతుందని అన్నారు అయినవోలు పోలీస్ స్టేషన్ కు ఈ రెండు గ్రామాలు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వీటిని అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని గతంలో జిల్లా ఉన్నత అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని అయినా సమస్య పరిష్కారం కాదని అన్నారు ఈ సమస్యలను ఈనెల 17 తారీకు వరకు ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చి పరిష్కరించాలని లేకుంటే 18 తారీకు నుండి ప్రజలందరినీ కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యేని కలిసిన వారిలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డ్ వరి కాల్ గోపాల్ రావు పాల్గొన్నారు.

Related posts

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం!-సంబరాల్లో కాంగ్రెస్ నేతలు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

అగ్రంపహడ్ సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Jaibharath News

కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.

Sambasivarao