ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ గా టీడీపీ నేత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న
2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాల సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని
బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు,సభ్యదేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషిచేస్తానని వెల్లడించారు.