*వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత పెట్టిన మున్సిపల్ కమిషనర్ జొనా*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 వర్ధన్నపేట ప్రతినిధి:-
స్వీపర్, కామటి, వాటర్ మెన్, డ్రైవర్ లకు సంబంధించి జులై నెల జీతంలో 4 నుండి 6 రోజుల జీతం వరకు కట్ చేసిన మున్సిపల్ కమిషనర్. కట్టింగ్స్ పోను ప్రతి నెల 14,800/- ఒచ్చే జీతం జులై నెలలో మాత్రం 12,123/- 12,600/- 13,213/- మాత్రమే జమ చేసిండని అవేదనవ్యక్తం చేశారు. ఇదే విషయమై బాధిత కార్మికులు మున్సిపల్ కమిషనర్ నీ ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్తూ వొచ్చే నెలలో కలిపి ఇస్తా అని చెప్పి వారిని సముదాయించే ప్రయత్నం చేసిన కమిషనర్. అసలు ఈ కార్మికులకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను వారి పిఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నారో లేదో అన్న అనుమానం కూడా కలుగుతోంది. దీని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. అసలే చాలి చాలని జీతంతో పని చేస్తున్న మాకు ఇలా జీతం కోత పెట్టడం అన్యాయంఅని సరిపడ సిబ్బంది లేకున్నా కూడా ఒక్కొక్కరం రెండు మూడు రకాల పనులు చేస్తూ పట్టణ పరిశుభ్రతలో భాగమవుతున్న మాకు ఇలా చేయడం దారుణమని మా పొట్టలు కొట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధిత ఉద్యోగులు. మున్సిపల్ కమిషనర్ కట్ చేసిన జీతాన్ని వెంటనే ఉద్యోగుల అకౌంట్లో జమ చేయాలని వర్ధన్నపేట తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తుంది. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆరా తీసి బాధిత ఉద్యోగుల పక్షాన నిలబడి మున్సిపల్ కమిషనర్ కట్ చేసిన జీతాన్ని తిరిగి ఇప్పించి ఉద్యోగులకు బాసటగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నాము.అసలు జీతాలు ఎందుకు కట్ చేశారన్న విషయం తెలుసు కోవడానికి మున్సిపల్ కమిషనర్ నీ ఫోనులో తీన్మార్ మల్లన్న టీం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.