గ్రేటర్ వరంగల్ నగరంలో సెప్టెంబర్ 16వ తేదీన ట్రై సిటీ పరిధిలో నిర్వహించే గణేష్ నిమర్జన కార్యక్రమానికి సంబంధించి హనుమకొండ ప్రాంతంలో గణేష్ ప్రతిమలు నిమజ్జనము జరిగే కాజీపేటలోని బంధం చెరువు, హనుమకొండలోని సిద్దేశ్వర గుండం, హాసన్ పర్తి చెరువులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్వనీ తానాజీ వకాడే, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, కాజీపేట్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు తిరుమల్, జితేందర్ రెడ్డితో పాటు నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, విద్యుత్తు,స్థానిక పోలీస్ అధికారులతో పరిశీంచారు.నిమజ్జనం కార్యక్రమ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సిపి, కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా చేశారు. ముఖ్యంగా నిమజ్జన జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన క్రెన్లు,సిబ్బంది నియామకం, విద్యుత్తు ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం, తెప్పల ఏర్పాటు పై సిపి, కలెక్టర్ అధికారులతో చర్చించారు.
previous post