వరంగల్ : సిపిఎం అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరి తిత్తులలో ఇన్ పెక్షన్ తో గత నెల 19 నుండి డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన మృతితో కమ్యూనిస్టు వర్గాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీతారాం ఏచూరి అంచెలంచెలుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. 1992 నుండి ఆయన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా పని చేస్తున్నారు..2005 నుండి 2017 వరకు పార్లమెంటులో రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఆయన అకాల మృతి పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా సిపిఐ, సిపిఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ సంతాపం
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మిక మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళపల్లి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలిపారు. సీతారాం ఏచూరి మృతి దేశం
కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు అని, వామపక్షాల బలోపేతానికి ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతితో కమ్యూనిస్టు శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆయన లోటు పూడ్చలేనిదని తెలిపారు