*పేదల కాలనీలకు తక్కువ ధరకే కరెంట్ మీటర్లు కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్*
వరంగల్ జిల్లా//శంభునిపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వరంగల్ ప్రతినిధి:-
ప్రభుత్వం పేదలకోసం తక్కువ ధరకు కరెంట్ మీటర్లు అందిస్తుంది. దీనిని అందరు ఉపయో గించుకోవాలని కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, ఎడి సర్వేశ్వర్ అన్నారు. ఈ సందర్బంగా 37వ డివిజన్ ఏం ఏం నగర్, గిరిప్రసాద్ కాలనిలలో కరెంట్ మీటర్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం నుండీ మీటర్లు కేవలం రూ,938/-లకే మీటర్లు ఇస్తున్న కార్యక్రమాన్ని కాలనిలో విధ్యుత్ ఏడి ఏఈ, లైన్ మన్, సిబ్బందిలతో ప్రజలకు అవగాహనా కల్పిస్తూ దరఖాస్తులు చేయించడం జరిగింది. అనంతరం ప్రజలను ఉద్దెశించి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, ఎడి సర్వేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ప్రవేశ పెట్టిన గృహజ్యోతి ఉచితంగా 200 యూనిట్స్ కరేంట్ పథకం కాలనీ వాసులందరు లబ్ధిపొందాలంటే అందరు మీటర్లు పెట్టుకోవాలని అందుకు ఇప్పుడు ప్రభుత్వం తక్కువ ఖర్చుకే మీటర్లు ఇస్తుందని అందరు సద్వినియోగం చేసుకొని గృహజ్యోతి పథకాన్ని పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ముఖ్య నాయకులు ఎస్ డి షబ్బీర్, సింగారపు ఏలీయా, శ్రీనివాస్, ఓర్సు సమ్మయ్య, ఐలయ్య,జగన్, రాజు, రవి,లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.