జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 హనుమకొండ హన్మకొండలోని డాల్పిన్ ఆసుపత్రిలో ఈనెల తొమ్మిదవ తేదీన జ్వరం వచ్చిందని సంవత్సరాల సాయిశ్రీ ని చికిత్స కోసం తల్లిదండ్రులు అడ్మిట్ చేశారు. ఆసుపత్రి వైద్యులు డెంగ్యూ ఫీవర్ అని చెప్పి ట్రీట్మెంట్ చేశారు ఒక రోజు ముందు పాప ఆరోగ్యం నిలకడగానే ఉంది ఎలాంటి భయం వద్దు అని హామీ ఇచ్చిన డాక్టర్లు. తల్లిదండ్రులు వెళ్లి పాపను చూస్తే చనిపోయిందని, డాక్టర్లు పట్టించుకోలేదని అందువల్లనే తమ పాప చనిపోయిందని హాస్పిటల్ ఎదుట పాప తరఫున బంధువులు విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళ చేపట్టారు. ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులు.విద్యార్థి నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కె,యూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

previous post