జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 వరంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిమీద అరికపూడి గాంధీ చేసిన దాడికి నిరసనగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు మేరకు చలోహైదరాబాద్ చేపట్టిన నేపద్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం గీసుగొండ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్ కోట ప్రమోద్, ప్రసన్నకుమార్, అజయ్, బాలులను గీసుగొండ పోలీసులు ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గొంతు నొక్కడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని, ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న మాకు ఇవేమీ కొత్త కాదు అని ముందు రోజుల్లో ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతాం అని అన్నారు.
previous post