జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని క్రిస్టియన్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ హుజురాబాద్ గంగిశెట్టి దయాకర్ జ్ఞాపకార్థం వారి తమ్ముడు గంగిశెట్టి జగదీశ్వర్ 25 వేల రూపాయలవిలువగల రెండు వందల యాభై స్టీల్ ప్లేట్లను పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిష్టయ్య మాట్లాడుతూ దానగుణం చాలా గొప్పదని డబ్బులు ఉండగానే సరిపోదు అని సేవ చేసే మనసు ఉండాలని జగదీశ్వర్ సేవలను కొనియాడారు ట్రస్టు నిర్వాహకులు జగదీశ్వర్ మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ దృక్పథంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఏ ఆర్ సి చైర్మన్ పద్మలత, సుధా బిందు, రమాదేవి, దేవరాజు, రాములు, కళ్యాణ్, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, కృష్ణ కుమార్, సంపత్, యాస్మిన్, సంతోష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
previous post