పొదుపు చేసిన డబ్బుకు అధిక మొత్తంలో చెల్లిస్తామని చెప్పి చీటీలు వేయించుకుని డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నా నిరంజన్ రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ <span;>పచ్చిక నిరంజన్ రెడ్డి <span;>వ్యక్తి శ్రీ అక్షయ ధరిని చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకుని అందులో 25 లేదా 50 మంది చొప్పున చిట్టి సభ్యులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, వారి వద్ద నుండి ఏజెంట్ల ద్వారా చిట్టి డబ్బులు వసూలు చేసి తన కంపెనీలో చిట్టి వేయండి ఒక సంవత్సరంలో ఇంట్రెస్ట్ తో సహా ఎక్కువ డబ్బులు ఇస్తామని మాయ మాటలు చెప్పగా, ఆ మాటలను నమ్మి 2018 సంవత్సరంలో ఆ చిట్ ఫండ్ కి బక్కి దిగంబర రావు అను వ్యక్తి 10 లక్షలు , 15 లక్షల రూపాయలు అతని భార్య అయినా బక్కి మంజుల పేరున 25 లక్షల రూపాయలు చిట్టిగా వేసి నెలవారీగా డబ్బులు చెల్లించినారు. దాంతో మొత్తం 50 లక్షల రూపాయలు కాగా 20 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా 30 లక్షల రూపాయలు మా చిట్ ఫండ్ నందు డిపాజిట్ చేయండి మీకు 18% ఇంట్రెస్ట్ తో ప్రతి నెల వాయిదాల రూపంలో చెల్లిస్తానని లేనిపోని ఆశలు కల్పించినాడు. అతడు చెప్పిన మాయమాటలను నమ్మి బక్కి దిగంబర రావు , అతని భార్య మంజుల పేరు మీద 30,00,000 రూపాయలను డిపాజిట్ చేసినాడు, ఇందుకు పిర్యాధీకి మొత్తంగా 32,92,500 ఇవ్వ వలసి ఉంది, కానీ పైన తెలిపిన సంస్థ యజమాని కేవలం 16,70,625 రూపాయలు మాత్రమే చెల్లించినాడు, మిగతా 16,21,875 రూపాయలు ఇవ్వకుండా భక్కి దిగంబర రావును అతని భార్య మంజులను మోసం చేసినాడని ఫిర్యాదు అందగా సుబేదారి ఎస్సై శ్రీకాంత్ పచ్చిక నిరంజన్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినారు.సిఐ తెలిపారు
previous post
next post