(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): వరంగల్ నుండి చౌల్లపల్లి మీదుగా ఆత్మకూరు వరకు ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు శుక్రవారం పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వరంగల్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఏర్పడిందని పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆత్మకూరు బస్టాండ్ లో తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి డిపో మేనేజర్ ధరమ్ సింగ్, పి ఆర్ ఓ రవీందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ బస్సు వరంగల్ నుండి ఏనుమాముల మార్కెట్ మీదుగా అక్కంపేట వరకు వచ్చి అక్కడ నుండి అగ్రంపాడు, ఒగ్గోనిపల్లి మీదుగా చౌల్లపల్లికి చేరుకుంటుందన్నారు. చౌల్లపల్లి నుండి కామారం మీదుగా ఆత్మకూరు వరకు వస్తుందని ఉదయం నుండి సాయంత్రం వరకు ఐదు ట్రిప్పులు బస్సుల వేళలను వెల్లడించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేష్, మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక, రాజు ఎంపిటిసి బొమ్మగాని భాగ్యలక్ష్మి, రవి, చౌల్లపల్లి మాజీ సర్పంచ్ కంచ రవికుమార్ సాంబయ్య, ఆత్మకూర్ పిఎస్ఏ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, పరికిరాల వాసు, రేవూరి,జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.