Jaibharathvoice.com | Telugu News App In Telangana
జనగామ జిల్లా

జఫర్ గడ్. మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 హనుమకొండ  ప్రతినిధి:-రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో కలిసి రావాలని దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేసుకుందాం. జఫర్గడ్ మండలాన్ని ఏడాదిన్నర కాలంలో మీరు గుర్తించే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు
<span;> జఫర్గడ్ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి జిల్లాకు ఉన్న పరువును, ప్రతిష్టను నాశనం చేశారు. తప్పకుండా జిల్లాల పునర్ వ్యవస్తీకరణ జరుగుతుంది. జఫర్గడ్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని నియోజకవర్గంలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్గడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మండల కేంద్రంలోని వాడవాడకు, గల్లీగల్లికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరెన్ని అసత్యాలు, దుష్ప్రచారాలు చేసినా వారందరికీ బుద్ది చెప్పే విధంగా తీర్పు ఇచ్చిన మీ అందరకి శీరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. మన గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారం చాలా అవసరమని అన్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను అన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మెదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు జఫర్గడ్ గ్రామానికి బీటి రోడ్డు వేయించానని తెలిపారు. జఫర్గడ్ మండలాన్ని విద్యా కేంద్రంగా మార్చినట్లు వివరించారు. త్వరలోనే జఫర్గడ్ మండలంలో బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గొప్ప చరిత్ర కలిగిన వేల్పుగొండ లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని, గుట్ట పైకి సిసి రోడ్డు, మెట్లు, లైటింగ్, కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. అలాగే మండల కేంద్రంలోని రామాలయం, శివాలయం, హనుమాన్ గుళ్లను ఆలయ కమిటీలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుందామని తెలిపారు. మండలంలోని పెద్ద చెరువును రిజర్వాయర్ చేయాలి, కట్ట మారమ్మత్తు చేయాలని దానికోసం ఇప్పటికే 6 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. మండల కేంద్రంలోని హన్మకొండ దర్వాజ నుండి ఓబులాపూర్ క్రాస్ వరకు నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. మండల కేంద్రంలో ఇంటర్నల్ సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో తహశీల్దార్ కార్యాలయం, బస్టాండ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉందని అన్నారు. నీటి పారుదల శాఖ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు సాగు నీరు అందించాలని, నష్కల్ నుండి పాలకుర్తకి వెళ్లే కాల్వల ద్వారా ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందిస్తానని అన్నారు. గ్రామంలో పర్యటించే క్రమంలో దాదాపు 30 వరకు సమస్యలు నా దృష్టికి వచ్చాయని అన్నారు. అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని, ఏడాదిన్నర కాలంలో జఫర్గడ్ మండలంలో మీరు గుర్తించే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. జఫర్గడ్ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉందని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రియంగా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన ప్రక్రియ చేపడితే జఫర్గడ్ మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వరంగల్ జిల్లాను 6ముక్కలు చేసి కాకతీయ సామ్రాజ్య పరువును, ప్రతిష్టను నాశనం చేశారని మండిపడ్డారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రితో తీవ్రంగా విబేదించానని అందుకే మంత్రి పదవి పోగొట్టుకున్నాని అన్నారు. జిల్లాల విభజన విషయంలో తప్పుడు నిర్ణయం జరిగిందని దానిని సరి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాది ఏ జిల్లానో చెప్పుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నానని, ఖచ్చితంగా జిల్లాల పునర్ వ్యవస్తీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి సారిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీ అందరి సహకారం లేకుండా నేను ఏమి చేయలేనని, అభివృద్ధి విషయంలో మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News

జఫర్గడ్ లో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహావిష్కరణ చేసిన కడియం శ్రీహరి

Sambasivarao

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News