జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం లో ఋణమాఫీ జరగని రైతులకు న్యాయం చేయాలని వారికి కూడా ఋణమాఫీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు విన్నవించారు ఈ సందర్భంగా రుణమాఫి అమలుపై, కొత్త పంట రుణాలపై,సాంకేతిక కారణాలతో ఋణమాఫీ జరగని రైతులకు త్వరగతిన ఋణమాఫీ అయ్యాలే చూడాలని వారికి విన్నవించగా సానుకులంగా మంత్రి స్పందించారని తెలిపారు.త్వరలోనే అర్హతగల ప్రతి రైతుకు ఋణమాఫీ చేస్తామని తెలపడం జరిగిందని అన్నారు మంత్రుని కలిసిన వారిలో టేస్కాబ్ వైస్ ఛైర్మెన్ కొత్తకురుమ సత్తయ్య, టేస్కాబ్ డైరక్టర్లు బోజారెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
