Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి.

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వర్ధన్నపేట
వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు సత్యం గార్డెన్స్ లొ జరిగిన కార్యక్రమం లో బిజెపి నాయకులు, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ బిజెపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధిలో, ప్రజ సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలపడానికి భారతీయ జనతా పార్టీలో సభ్యులమై వికసిత భారతన్ని నిర్మిద్దాం, రాబోయే రెండు నెలలు కార్యకర్తలందరూ కష్టపడి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు, కింది స్థాయిలో ప్రజాప్రతినిధులను గెలిస్తేనే పార్టీ బలం పెరుగుతుంది, ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉన్న సమయం సభ్యత్వనమోదు కార్యక్రమం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసుకోవచ్చని, దానికి పార్టీ సభ్యత్వాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యకర్తల సహకారంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని గ్రామాలలో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు, సభ్యత్వ నమోదు కోసం 8800002024 నంబర్ కి   మిస్ కాల్ ఇచ్చి తద్వారా మీ యొక్క వివరాలు పొందుపరిచి భారతీయ జనతా పార్టీ సభ్యులు కావాలని సూచించారు  ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జిల్లా సభ్యత్వ ఇంచార్జ్ పాపారావు, జిల్లా సభ్యత్వ సహ ప్రముఖ పాపన్న, జిల్లా సభ్యత్వ ప్రముఖ కుసుమ సతీష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, వర్ధన్నపేట నియోజకవర్గం సభ్యత్వ ప్రముఖ మల్లాడి తిరుపతి రెడ్డి, హన్మకొండ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు బన్న ప్రభాకర్, కాజీపేట దర్గా పిఎసిఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, వరంగల్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు పట్టపురం ఏకాంతం గౌడ్, హసన్ పర్తి మండల మాజీ జెడ్పిటిసి సునీత, జలగం రంజిత్, మజ్జిగ జైపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి

Jaibharath News

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు