జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 వరంగల్ ప్రతినిధి:-
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పు కోట ముదిరాజ్ వాడ సీరబోయిన వీధిలో మహా అన్నధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్న ధన కార్యక్రమం నిర్వహించిన నిర్వహణ కమిటీని అభినందించి. ఆ గణపతి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈసందర్బంగా ప్రత్యేక పూజలో పాల్గొని అనంతరం భోజనాలు వడ్డీంచి, భోజనం చేసారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ వీధి ముఖ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు శిరబోయిన శ్రీనివాస్, వాసుదేవ్, రాజన్, కిరణ్, సతీష్, ప్రసాద్, నవీనులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.