May 7, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నర్సంపేటలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో వాసవి కళ్యాణ మండపంలో నియోజకవర్గ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా సభ్యత్వ ఇంచార్జ్ పాపారావు, ఎస్సీ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎడ్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధిలో, ప్రజ సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలపడానికి భారతీయ జనతా పార్టీలో సభ్యులమై వికసిత భారతన్ని నిర్మిద్దాం, రాబోయే రెండు నెలలు కార్యకర్తలందరూ కష్టపడి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు, కింది స్థాయిలో ప్రజాప్రతినిధులను గెలిస్తేనే పార్టీ బలం పెరుగుతుంది, ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉన్న సమయం సభ్యత్వనమోదు కార్యక్రమం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసుకోవచ్చని, దానికి పార్టీ సభ్యత్వాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యకర్తల సహకారంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్ని గ్రామాలలో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు, సభ్యత్వ నమోదు కోసం 8800002024 నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి తద్వారా మీ యొక్క వివరాలు పొందుపరిచి భారతీయ జనతా పార్టీ సభ్యులు కాగలరని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ ఫ్రముఖ్ కుసుమ సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, నర్సంపేట కాంటెస్ట్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు బన్న ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీనివాస్, నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ వడ్డేపల్లి నరసింహా రాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి,  వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శక్తి కేంద్ర ఇన్చార్యులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల

Sambasivarao

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని

Sambasivarao
Notifications preferences