జై భారత్ వాయిస్ న్యూస్ గీసుగొండ, సెప్టెంబరు 14: గీసుకొండ మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పనిచేస్తూ గుర్తూరుకు బదిలి అయిన నాగేశ్వర్ రావు ను ఉపాధ్యాయులు శ్రీకాంత్, స్రవంతి, స్వప్నలను శనివారం ఘనంగాసన్మానించి వీడ్కోలు పలికారు. ఎంతో సౌమ్యుడిగా విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేసిన ప్రిన్సిపాల్ వెళుతున్న కారు వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లి ఆత్మీయంగా వీడ్కోలు చెప్పారు. ఆయనకు విద్యార్థులు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రజితసారంగం, సీనియర్ ఉపాధ్యాయురాలు మాధవి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, సీఆర్పీ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
