జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 వరంగల్ ప్రతినిధి:-గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీలో గత 32 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తున్న వినాయక ఉత్సవాల వేడుకల్లో నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్. వినాయకుని వేడుకల్లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా యువజన సంఘ సభ్యులందరికీ ఖైరతాబాద్ వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు చేసిన కండువాలను తీసుకువచ్చి అందజేశారు. అందరూ ఆరోగ్యంగా, సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ముందుగా గ్రామంలోని శివాలయంలో తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి గ్రామస్థులు లు బంధువులు సత్యనారాయణ, శోభన్, రవీందర్, రమేష్, ఐలోని అభిషేక్, ముదిగొండ శ్రీనివాస్, కేపీ రాజు, బొల్లు రమేష్, గట్ల శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు.
