నూజివీడు/ముసునూరు సెప్టెంబరు మండలంలోని గోగులంపాడు గ్రామంలో గొర్రెల కాపరులకు దానామృతం రేషన్ పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్ధసారధి గొర్రెల కాపరులను పలకరిస్తూ వారి యొక్క యోగక్షేమాలను మంత్రి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 33 వేలు గొర్రెలు 420 మంది రైతులు ఉండగా గ్రామంలో 3 వేలు,గొర్రెలు ఉన్నాయని ప్రతి ఒక్క మూగ జీవికి నట్టల వ్యాధి నివారణకు టీకాలు వేసితీరాలని అధికారులకు ఆదేశించారు .ప్రతీ ఒక్క గొర్రెల కాపరిని ఆర్ధికంగా ఆదుకుంటామని అన్నారు. గొర్రెల్లో నట్టల వ్యాధి నివారణకు అవసరమైన అన్ని రకాల మందుల పంపిణీకి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గొర్రెల కాపరులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని గొర్రెల కాపరులకు మంత్రి భరోసా ఇచ్చారు. గొర్రెల కాపరులు ప్రభుత్వ ఇచ్చే రాయితీలు అందిపుచ్చుకోవలని చూసించారు ప్రభుత్వం గొర్రెల కాపారులకు 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇస్తుందని 50 శాతం సబ్సిటీ ఇస్తుందని తద్వారా గొర్రెల పామ్స్ నిర్మించుకొని ఆర్ధికంగా స్థిర పడవచ్చుని చూసించారు అంతేకాక గొర్రెల ఫామ్స్ ద్వారా గొర్రెలు దిగుమతి త్వరగా వచ్చి లాభాలు ఆర్జించ వచ్చుని అన్నారు. గౌరవ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి గొర్రెల కాపరుల సమస్యలన్నీ తీసుకెళ్లగా తక్షణమే పరిష్కరిస్తానని అన్నారని తెలిపారు. రాష్ట్ర గొర్రెల కాపరులందరూ కలిసి లోకేష్ బాబుకి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయనున్నట్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి చూసించారు.ఈ కార్యక్రమంలో రైతులు, గొర్రెల కాపరులు, తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులకు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post