జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-
సాంకేతిక రంగంలో విప్లవాల సృష్టించి భారత దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇంజనీర్స్ డే (శ్రీ మోక్షగుండం విశ్వశ్వరయ్య జయంతి )సందర్భంగా ఎమ్మెల్యే హనుమకొండలోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా ఇంజనీర్ అధికారులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహానగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న ఇంజనీర్లను అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, ధర్మ శ్రీనివాస్ రెడ్డి, ఏ.కృష్ణా రావు, ఏ ఈ లు శంకరయ్య, ఇజిగిరి, సంఘనాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, సహచరులు తదితరులు పాల్గొన్నారు.

next post