April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఏ ఈ ఓ ఆబిద్ కు ఆత్మీయ సన్మానం

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 15 )
గీసుకొండ మండలం మొగిలిచర్ల క్లస్టర్ లోని మొగిలిచర్ల, గొర్రెకుంట, పోతరాజుపల్లి, బొడ్డు చింతలపల్లి, రెడ్డిపాలెం గ్రామాలకు వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేసి ఇటీవల బదిలీ అయిన మహమ్మద్ ఆబిద్ హుస్సేనుకి ఆదివారం మొగిలిచర్ల రైతు వేదికలో ఆయనకు   పిఎసిఎస్ మొగిలిచర్ల చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ దొంగల రమేష్ అధ్యక్షతన ఏవో హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరైన ఘనంగా సన్మానించారు.   ఈకార్యక్రమంలో నాలుగు గ్రామాల రైతులు పాల్గొని ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏఓ హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నాలుగు గ్రామాలలో మొగిలిచర్ల క్లస్టర్ లో ఆబిద్ హుస్సేన్ రైతులతో మమేకమై పనిచేయడం గర్వంగా ఉందని చెప్పారు. సభాధ్యక్షులు దొంగల రమేష్ మాట్లాడుతూ ఆబిద్ సేవలను మరువలేమని ఈ నాలుగు గ్రామాలు రైతులు కృతజ్ఞతగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మొగిలిచర్ల శాఖ మేనేజర్ సౌందర్య గీసుగొండ పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేందర్ మొగిలిచర్ల పిఎసిఎస్ డైరెక్టర్లు లెంకలపల్లి స్వామి, జనగాం శ్రీనివాస్, బిల్ల రవి, వనపర్తి కట్టస్వామి, వనపర్తి రాజు, అచ్చా కల్పనామనోహర్, కందుల సునీత జ్ఞానేశ్వర్, లెదెళ్ల అశోక్, పోషాల కిషన్, నమస్తే  అప్పని సూరి మాజీ ప్రజా ప్రతినిధులు అచ్చ మధుకర్, పోగుల హరికృష్ణ , పోగుల యుగంధర్, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నమిల్ల బాబు, రైతు సంఘం నేత  సంజీవ, రైతు సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు

Related posts

Donate blood and become life donors రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్  వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్

నిర్బంధాలతో బీ.ఆర్.ఎస్ కార్యకర్తల్ని అణచలేరు