వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు.ఆగిరపల్లి మండలం, చిన్న ఆగిరిపల్లి గ్రామంలో గణపతి నవరాత్రుల సందర్బంగా ప్రతిష్టించిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం గణపతి ఉత్సవ సంభరాన్ని ప్రారంభించిన మంత్రి గణపతి నవరాత్రుల సందర్బంగా ప్రతిష్టించిన గణేశునికి గత 9 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు లడ్డూ వేలం పాట వేయగా వచ్చిన నగదును విజయవాడ వరద బాధితులకు సహాయార్ధం అందిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని, జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ప్రజలు సహకరించాలన్నారు.కోరిన కోరికలు తీర్చే గణపతి, విజ్ఞాధిపతి అయిన గణనాథుడి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. గణపతి ఆశీస్సుల పాడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. గణేశుని చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందాలన్నారు. సిద్ది వినాయకుని ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ నాయకత్వంలో ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు.
