Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శ్రీ మత్స్యగిరి స్వామి గుడికి చేయూత

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 పరకాల
శాయంపేట మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి శ్రీ మత్స్యగిరి  స్వామి దేవాలయానికి పంచాయతీ రాజ్ రిటైర్డ్ డిప్యూటీ ఇంజనీర్ వలపదాసు విజయ్ కుమారు సౌందర్య దంపతులు చేయూత అందించారు. ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయమైన శ్రీ మత్స్య గిరి స్వామిని కోరుకున్న మొక్కులు నెరవేర్చాడని శాయంపేటకు చెందిన విజయ్ కుమారు సొంత ఊరి గుడికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆలయంలోని స్వామి వారి గర్భగుడికి మండపానికి 60 వేల రూపాయలు ఖర్చు చేసి గ్రానైట్ రాయిని వేయించారు. ఈ మేరకు ఆదివారం పనులు పూర్తి కావడంతో ఆలయంలో గుడి అభివృద్ధికి సహకరించిన విజయ్ కుమారును ఆలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో ఉంటున్నప్పటికీ సొంత ఊరి గుడిపై మమకారంతో అభివృద్ధికి ముందుకు వచ్చిన విజయ్ కుమారును స్ఫూర్తిగా తీసుకొని ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని చైర్మన్ సామల బిక్షపతి విజ్ఞప్తి చేశారు.

Related posts

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

*78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి: ఎంపి కడియం కావ్యం