జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 నర్సంపేట ప్రతినిధి:-నర్సంపేట నియోజకవర్గన్ని మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ హబ్ గా తయారు చేయడం జరిగిందని నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని సూరన్న, తెలిపారుఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నర్సంపేటకు ఎవరు ఊహించని మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల జిల్లా హాస్పిటల్ ను ఏర్పాటుచేసి నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు నెక్కొండ మండలానికి కూడా సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసమే ఆనాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేత ప్రతిపాదనలో సిద్ధం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు, ఇప్పుడున్న నాయకత్వం ఇప్పుడున్న ప్రభుత్వం నెక్కొండలోని సివిల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్, సొసైటీ చైర్మన్ మారం రాము, నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, తాటిపల్లి శివకుమార్, గాదె భద్రయ్య, కారింగుల సురేష్ పొడిశెట్టి సత్యం, తోట సాంబయ్య, బక్కి కుమారస్వామి, బాధవత్ రవి, ప్రభాకర్, జుట్టుకొండ వేణు, ఈదునూరి వెంకన్న, పట్టణ యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి రాజు, శ్రీనాథ్, శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post