Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

18న కలెక్టరేట్ ను జయప్రదం చేయండి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 వరంగల్  గీసుకొండ మండల కేంద్రంలో బిల్డింగ్, ఇతర కట్టుడు పనివాళ్ళ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మాలోతు సాగరు పాల్గొన్నారు. సాగర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను ప్రైవేటు బీమా కంపెనీలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూన్నామని అన్నారు. కార్మిక శాఖ ద్వారా సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేయాలన్నారు. ఈనెల 18 వ తేదీన కలెక్టరు కార్యాలయం ధర్నా, 23 న చలో హైదరాబాద్ లేబర్ కార్యాలయం కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల బకాయి బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి ఓదేలు, సిఐటియు మండల కన్వీనర్ టి బ్రహ్మచారి గీసుకొండ బిల్లింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు గోరుకంటి రమేష్, మండల కోశాధికారి ధూపాకీ రాజు, గుండా రమేష్, గుడిపాక కుమారస్వామి, చిన్నగారి ప్రకాష్, టి కృష్ణ, మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం

హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే