Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్ 2024 పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఆడప అభినవ నేతాజీ బ్రాంజ్ మెడల్ సాధించారు.వరంగల్ జిల్లాకు చెందిన అభినవ నేతాజీ హైదరాబాద్ సరూర్ నగర్  ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14,15వ తేదీన 11వరాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్  పోటీలు నిర్వహించగా వరంగల్ జిల్లా నుండి యోగాసన పోటీల్లో పాల్గొన్న అభినవ నేతాజీ  16 -18 ఎళ్ళ వయస్సు విభాగంలో అత్యంత ప్రతిభను చాటి రాష్ట్రస్థాయిలో యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ సాధించి బ్రాంజ్ (కాంస్య పతకం) మెడల్ కైవసం చేసుకున్నాడు.త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో జరగనున్న జాతీయ స్థాయి యోగాసన పోటీలకు ఎంపికయ్యాడు.తెలంగాణ యోగ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం మెడల్ అభినవ నేతాజీకి బహుకరించారు

Related posts

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం

ఎమ్మేల్యే పదవికి హరీష్ రావు రాజీనామా లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా

REPORTER JYOTHI