Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 17
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ నగరంలోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గందె శ్రావణ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ కుమార్ అతిధులుగా విచ్చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం నిజాం పరిపాలనలో మగ్గింది అనేకమంది తెలంగాణ అమరవీరుల సాయుధ పోరాటం ద్వారా భారత ప్రభుత్వ సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య పరిపాలనకు నోచుకుంది కాబట్టి ఆ రోజున ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పోరాటం స్వేచ్ఛ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుందని కాబట్టి విద్యార్థులు చరిత్రను తెలుసుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతి. లక్ష్మీనారాయణ. శ్రీనివాస్ .దేవరాజ్. నరేందర్. అంజయ్య. కవిత. సుజాత. జోష్ణ కిరణ్మయి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related posts

మృతిచెందిన కుటుంబాలను మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు     

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు