April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

జైభారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట సెప్టెంబర్ 17
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండల యూత్ ప్రెసిడెంట్ మూడు రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకంచేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అద్భుత మైనటువంటి ఆలోచనతోటి సెక్రటేరియట్ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సెక్రటేరియట్ నిర్మించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి సంకల్పించారో దాని స్థానంలో యావత్ తెలంగాణను కించపరిచే విధంగా నేడు తెలంగాణ ద్రోహి లైనటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ మాజీ ఎంపిటిసి శ్రీను మాజీ ఎంపిటిసి కుమారస్వామి బానోత్ గణేష్ సాంబయ్య సాదు నర్సింగరావు బీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్ గుగులోతు రాజేందర్ రాజు నాయక్. సోషల్ మీడియా ఇంచార్జ్ సుమన్ రాథోడ్. రాజశేఖర్. విజేందర్. సురేష్. తదితరులు పాల్గొన్నారు.

Related posts

కులగనన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి చాపర్తి కుమార్ గాడ్గే

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

Jaibharath News

గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన