Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వరంగల్ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టంబర్ 17
హనుమకొండ: హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం, పోచమ్మ కుంట మోడల్ గ్రేవీ యార్డ్, గ్రేటర్ వరంగల్ పరిధిలోని పార్కు స్థలాల ఆక్రమణ, రీజినల్ సైన్స్ సెంటర్ భూమి ఆక్రమణ, నాలాల ఆక్రమణలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతి, నిధుల కేటాయింపు, డంపింగ్ యార్డ్, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు, ఓ ఆర్ ఆర్ పనులు, కాజీపేట ఆర్ఓబి, తదితర అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో వెంకటేష్, కుడా పీవో అజిత్ రెడ్డి, మున్సిపల్, సాగునీటి పారుదల, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులతో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెండో పెద్ద నగరమైన వరంగల్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, అందుకే తనను ఈ జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగించారని అన్నారు. అందుకే వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేవి రెండు కళ్ళలాంటివని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం తో పాటు వరంగల్ నగరాభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించినట్లు పేర్కొన్నారు. నగర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులను కూడా విడుదలయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి నిధులను కేటాయిస్తామన్నారు. పేదలకు పెద్దదిక్కుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఉందని ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు , చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి వైద్య సేవల కోసం నిరుపేదలు వస్తుంటారని, అలాంటి ఆసుపత్రిలో మందుల కొరత అనేది సహించలేనిదని అన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో మందుల కొరత రాకుండా చూసుకోవడంలో అధికారులు ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో విద్య వైద్యంపై ఎమ్మెల్యేలు తరచుగా పర్యటించాలన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందే విధంగా పర్యవేక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో కృషి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చునని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఫిర్యాదులను స్వీకరించి వాటికి సంబంధించిన నివేదికను అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు నుండి ప్రజలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడినందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పాత్రికేయులకు ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తప్పకుండా ఇంటి స్థలాలను అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పాత్రికేయుల ఇంటి స్థలాల విషయంలో కాలయాపన చేసిందని పేర్కొన్నారు. అలా కాకుండా అర్హులైన వారి జాబితాను ఆయా కమిటీలు అందిస్తే ఇంటి స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంటి స్థలాల విషయంలో ఆయా యూనియన్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో ఒకసారి సమావేశమై చర్చించాలన్నారు. ఇటీవలనే హైదరాబాదులో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించినట్లు పేర్కొన్నారు. నాలాలపై ఎలాంటి నిర్మాణాలు ఉన్న ఉపేక్షించవద్దని, ఎంతటి వారు ఉన్న వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలపై నిరుపేదలు ఉన్నట్లయితే వారికి సరైన చోట నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, ఎంత పెద్ద వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం ఊరుకోదన్నారు. కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాక్షేత్రం ప్రారంభోత్సవం కోసం వచ్చే నెల రెండవ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉండనుందని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం సంబంధించిన వివిధ అంశాలపై ఆర్ అండ్ బి మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య ప్రస్తావనకు వచ్చిందని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని అన్నారు.ఈ సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరిన్ని నిధులను కేటాయించాలని అన్నారు. స్మార్ట్ సిటీ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. నాలాల ఆక్రమణ తొలగింపు విషయంలో కార్పొరేషన్కు అనేక ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, సాగునీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సహకారం అందిస్తే నాలాల విస్తరణ పనులను పూర్తి చేయవచ్చునని తెలిపారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. వరంగల్ లో అనేక పురాతన ఆలయాలు నెలవై ఉన్నాయని, వాటి పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లయితే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వరంగల్ నిలుస్తుందన్నారు. కేంద్రం నుండి వరంగల్ అభివృద్ధికి నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్కు స్థలాలు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విలువైన పార్కు స్థలాల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం అభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు.ఆయా జిల్లాలకు సంబంధించిన, గ్రేటర్ వరంగల్ సంబంధించిన వివిధ అంశాలను గురించి కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్, కుడా అధికారులు పాల్గొన్నారు.

Related posts

కటాక్షపురంలో ప్రజా పాలన పై గ్రామ సభ

Jaibharath News

యువత గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు