జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకులతో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ జాతీయ పతాకం ఎగురవేశారు. . అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమైక్యత దినోత్సవం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారని విమర్శించారు. నిజాంపాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు, మహిళల మీద జరిగిన దాడులను గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ, కొమరంభీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, మొగులయ్య గౌడ్ ఇంకా ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదన్నారు. విమోచన దినోత్సవానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన నిజాంమెడలు వంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకుల రఘునరెడ్డి, మాచర్ల దీన్ దయాల్, ఏకాంతం గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గట్టిగొప్పుల రాంబాబు, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరీ మురళికృష్ణ, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు బైరి నాగరాజు, కార్యదర్శి కంది క్రాంతి కుమార్, పెద్ది నవీన్, కందుకూరి శ్రీనివాస్, చింతాం రాజు, వెంకటేశ్వర్లు, 34వ డివిజన్ బిజెపి అధ్యక్షులు మహమ్మద్ రఫీ మరియు తదితరులు పాల్గొన్నారు.
