Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టంబర్ 17
గీసుకొండ మండలంలోని ప్రగతి మండల సమైక్య 15వ వార్షిక మహాసభ మంగళవారం కోనయమాకుల గ్రామంలోని ప్రగతి మండల సమైక్య భవనంలో మండల సమైక్య అధ్యక్షురాలు గూబాల కవిత అధ్యక్షతన జరిగినది. ఈ మహాసభకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూమహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని ఆదిశక్తి పరాశక్తి మహిళా శక్తి అని అన్నారు1994 కి పూర్వం మహిళలు ఒంటింటికే పరిమితమై భయటికి రావాలంటే భయపడే స్థాయి నుండి నేడు కుటుంబ ఆర్థిక పరిస్థితి తో పాటు దేశ ఆర్థిక పరిస్థితిని మార్చే స్థాయికి మహిళలు ఎదిగారని అన్నారు1999లో తాను నర్సంపేట ఎం ఎల్ ఏ గా పాఖాల మహిళా బ్యాంక్ ఏర్పాటు చేయించి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మొదటి మహిళా బ్యాంక్ ఏర్పాటుకు అంకురార్పణ చేయడం జరింగని చిన్న విత్తనం నుండి నేడు మహా వృక్షంగా ఎదిగినదని అన్నారు పట్టుదలతో నిజాయితీతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని మహిళా సమైఖ్యల అభివృద్ధికి తాను అన్నివిధాల సహకరిస్తానని తెలిపారు .మహిళా సమైక్య భవనం నకు ప్రహరిగొడకు, మెయిన్ రోడ్ వరకు సీ సీ రోడ్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరికి కృషి చేస్తానని చెప్పారు. .మహిళలు ఆర్థికంగా బలపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని,మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.వార్షిక ప్రణాళిక ఆమోదంలో భాగంగా సంస్థ గత నిర్మాణం, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, మహిళా శక్తి, అమ్మ దర్శ పాఠశాల కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరారు.టెక్స్టైల్ పార్కు కు మహిళా సమైఖ్యల ద్వారా రేడ్ మెడ్ దుస్తూలు, గార్మెట్స్ కుట్టి ఇచ్చేలా మాట్లాడి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి గీసుకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దౌడు ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపీటీసీ దౌడ్ భరత్ కోమల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి జావిద్ కాంగ్రెస్ నాయకులు తాటికొండ నరేందర్ కంతిరి రవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్

బాదిత కుటుంబాన్ని పరామర్శ