ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి
జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17 ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు హనుమకొండలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులుపడుతున్నారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జశ్వంత్ సాయి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

next post