తెలంగాణ సమాజానికి రాచరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ప్రభుత్వాదేశానుసారం ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న వేళ జాతి పోరాటం ఫలించిన క్షణమని గుర్తు చేశారు. నిజాం పాలన నుండి విముక్తి పొందిన గొప్పదినమని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ ఛైర్మన్ మారపెల్లి రవీందర్, నాయకులు చిందం రవి, దుబాసి కృష్ణమూర్తి, వైనాల కుమారస్వామి, మారపల్లి కట్టయ్య, నిమ్మల రమేష్, సీనియర్ నాయకులు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి, ప్రపంచ రెడ్డి, రాజేందర్, వరదరాజు, రఫీ, వీరన్న, బిక్షపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

previous post