జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 నర్సంపేట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మరియు _నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం_ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుసంగని సూరయ్య, మాజీ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్, మాజీ జడ్పీటీసి సరోజహరికిషన్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ మారం రాము, నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ సోసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొణిజెటి బిక్షపతి, రావుల భాస్కర్ రెడ్డి, దేవానబోయిన విరభద్రం, కారింగుల సురేష్ గౌడ, బక్కి కుమారస్వామి, మెండే వెంకన్న, ఈదునూరి వెంకన్న, బానోత్ లింగ్య, శోభన్, అశోక్, ఖలీల్, నరేందర్, లావుడ్యా యాకుబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
next post