జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 18 జాతీయ మాజీ అధ్యక్షులు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ లెక్చరర్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ అన్నారు బుధవారం రోజున భీమారంలోని శివాని జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు అనంతరం వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా డాక్టర్ పుల్లా శ్రీనివాస్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏచూరి జీవితం విద్యార్థి దశ నుండి మొదలైంది అన్నారు తన చిన్న వయసులోనే ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేసి దేశంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివి గోల్డ్ మెడల్ సాధించారు అన్నారు విద్యార్థి ఉద్యమాల అనంతరం సిపిఎం పార్టీలోకి రావడం జరిగిందన్నారు తన జీవితాన్ని మొత్తం సిపిఎం పార్టీకి ప్రజాసేవకే అంకితం చేశారన్నారు ఇలాంటి గొప్ప నాయకున్ని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు వారు మరణించిన వారి ఆశయాలు ఈ భారత దేశంలో ఇంకా బ్రతికే ఉన్నాయన్నారు వారు చేసిన త్యాగాలు చాలా గొప్పవి అని కొనియాడారు నేటితరం విద్యార్థులు యువకులు వారి యొక్క ఆశయాల కోసం వారు కోరుకున్న ప్రజాస్వామ్యం కోసం విద్యార్థుల పేద ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు నడవాలి అని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ సాయి సందీప్ వినయ్ రాజ్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
