Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పొనుగోటి సత్యనారాయణకు జాతీయ స్థాయి నంది పురస్కారం

 

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);సామాజిక రంగం లో ఎక్కువ సేవలందించిన పొనుగోటి సత్యనారాయణకు జాతీయ స్థాయి తెలుగు వెలుగు నంది పురస్కారం లభించింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన పొనుగోటి సత్యనారాయణ దశాబ్ద కాలంగా సమాజంలో అనేక సేవలందిస్తున్నారు. ఈ సేవలకు గాను విజయవాడ బాలోత్సవ భవన్ లోని గిడుగు వెంకట రామమూర్తి జయంతి ఉత్సవాల సందర్భంగా కాళోజి బుక్ ఆఫ్ రికార్డ్స్ , న్యూ ఢిల్లీ నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో తెలుగు వెలుగు సంస్థ చేపట్టిన తెలుగు వెలుగు జాతీయ నంది అవార్డు పురస్కారం అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పోలోజి రాజ్ కుమార్, అద్దంకి నాగరాజు అధ్యక్షతన చందు సాంబశివరావు మాజీ ఇస్రో నాసా శాస్త్రవేత్త , కత్తి వెంకటేశ్వర్లు అధికార భాషా సంఘం సభ్యుడు ఆంధ్రప్రదేశ్ గారి చేతుల మీదుగా నంది అవార్డు అందు కున్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక ఒడిస్సా రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఇందులో గుర్రం జాషువా కవి వారసురాలు అమృతపూర్ రేవతి, ఝాన్సీ లక్ష్మీబాయి వారసాలు శాంతాబాయి, మండలి లక్ష్మణ్ బాబు , శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం మాజీ సభ్యులు కొండ్రు సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వెలుగు నంది అందుకున్న సత్య నారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. వెలుగు నంది అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. నాకు కార్యక్రమాల్లో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గణేష్ నిమజ్జనం ప్రదేశాలను పరిశీలించిన సిపి, కలెక్టర్

Sambasivarao

నారాయణ స్వామి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు

Jaibharath News

పదవులు లేకున్నా సమాజ సేవకు అంకితం కావాలి – పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Sambasivarao