Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కాంగ్రెస్ నేతల నిరసన

జైభారత్ వాయిస్ న్యూస్హ నుమకొండ సెప్టెంబర్ 18 ఏఐసీసీ ,టీపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద హనుమకొండా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నిరసన చేపట్టారు పీసీసీ చీఫ్ మాట్లాడుతూ. గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారని రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా బీజేపీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా కనుసన్నళ్ళో గాడ్సే విధానాలను అనుసరిస్తున్నా  బీజేపీ నేతలు మాట్లాడుతుంటే ప్రధాని, హోమ్ మంత్రి చోద్యం చూస్తున్నారని తెలిపారు  రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఒక ప్రధానమంత్రి కావాలని అభిమానం చూపుతున్నారని ఆనాడు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కానీ, పార్టీ ప్రయోనాల కోసం కానీ మరణించలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా, దేశంలో తీవ్రవాదం రూపు మాపాలనే చర్యలో త్రివ్రవాదుల చేతులో హత్యకాబడినారని అన్నారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ. బిసి బిడ్డ మా అందరి ఆప్తుడు మహేష్ కుమార్ కి పీసీసీ అధ్యక్షులుగా రావడం చాలా సంతోషం. 10ఏళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఆపదవి తీరస్కరించిన గొప్ప కుటుంబం. గాంధీ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ గుండు సుధారాణి, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు.

Related posts

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత సోనియా గాంధీ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ముందంజ

Sambasivarao

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలి