Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నియోజకవర్గ అభివృద్దే నాకు లక్ష్యం

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ <span;> సెప్టెంబర్19 గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ 57వ డివిజన్ గాంధీ నగర్ లో 40లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు గడిచిన 9నెలలుగా మహా నగరంలో ఎటువంటి కబ్జాలు లేవు అని రానున్న రోజుల్లో కబ్జాలు జరగకుండా చూస్తానని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని డివిజన్ లను సమావుజ్జిగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పడతామని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. ఇటివలే కురిసిన వర్షాలకు నగరంలో దాదాపు ముంపు లేకుండా ఉన్నప్పటికీ అత్యవసర నిధుల క్రింద గోకుల్ నగర్ జంక్షన్ నుంచి కెయు రోడ్డు వరకు . కోటి రూపాయలనిధులను మంజూరు చేయడం జరిగిందని ఈ నిధులతో సైడ్ డ్రైన్ పనులు ప్రారంభం జరుగుతుందని తెలిపారు.గత ప్రభుత్వ నాయకులు కార్పొరేషన్ లో 5కోట్ల నిధులు ఉంటే 50 కోట్లకు కొబ్బరికాయలు కొట్టారు. కాగితలకే పనులు పరిమితం చేశారాని ఎమ్మెల్యే ఏద్దేవా చేశారు. నాయిం నగర్ బ్రిడ్జ్ నిర్మాణం, కాళోజి కళక్షేత్ర పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు.రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చెప్పడతనని అన్నారు. నా పేరు చెప్పే దళారులను నమ్మొద్దు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చాలా మంది నా పేరు చెప్పి గాని, పార్టీ పేరు చెప్పి కానీ ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే నాకు తెలియజేయాల నీసూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Jaibharath News

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

Jaibharath News

సీతక్క చే గణిత పుస్తక ఆవిష్కరణ

Jaibharath News