జైభారత్ వాయిస్ న్యూస్ పరకాల సెప్టెంబర్ 19
తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించ లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు
<span;>ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా కమిటీ సభ్యులు మడికొండ ప్రశాంత్ బొజ్జ హేమంత్ బొచ్చు ఈశ్వర్ ప్రవళిక ప్రేమ్ సందీప్ అనూష శిరీష తదితరులు పాల్గొన్నారు.

previous post