Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలి

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ కోనాపురంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ పోల్స్ లేక డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఈ సమస్యపై ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.విద్యుత్ పోల్స్ లేకపోవడంతో కర్రలకు సర్వీస్ వైర్ కట్టడంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని గ్రహించిన కోనాపురం  యువకులు, శుక్రవారం విద్యుత్ అధికారులను కలిసి డివిజన్ పరిధిలో కరెంటు పోల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  కొనాపురం డివిజన్ కి చెందిన  సతీష్, తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు ఆకుల మనోజ్, డివిజన్ యువకులు అజయ్, అశోక్, నరేందర్, ప్రదీప్, యాకయ్య, నిఖిల్ పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

తల్లిదండ్రులను కోల్పోయి… అనాధలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Jaibharath News

కొమ్మాలలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో  చేరిక