Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

*బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి* 

 

హనుమకొండ జిల్లా/శాయంపేట

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 పరకాల ప్రతినిధి:-

 

శాయంపేట మండలంలో బీజేపీ కార్యాలయం మండల అధ్యక్షుడు గడ్డం రమేష్ గారి అధ్యక్షతన 8800002024 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపిలో సభ్యులు అవ్వండి సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా బిజెపి అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి రావడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని కొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ… ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీనీ చూస్తున్నామని, రాష్ర్ట అభివృద్దినీ కుంటుపడేలా చేస్తున్నారని, 2047 వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని లక్ష్యంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారన్నారని అన్నారు. ఎందుకోసం తెలంగాణ కావాలని కోరుకున్నమో అది నెరవేరాలి అంటే బీజేపీ అధికారంలోకి రావడం అవసరమనన్నారు. ప్ర‌ధాన మంత్రి నిర్దేశించిన ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆయ‌న అన్నారు. స్కాంగ్రేస్ ప్రభుత్వం పట్ల నిరాశతో ఉన్నందున ఉత్సహంగా పార్టీ సభ్యులు అవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకులు మొగిలి ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు బీజేవైఎం ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీకాంత్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి భూత్ అధ్యక్షులు కోమటి రాజశేఖర్ కడారి చంద్రమౌళి వీరస్వామి తిరుపతి సీతారాం రెడ్డి సుమన్ ఎర్ర తిరుపతి రెడ్డి సుధాకర్ రఘుపతి తదితరుల కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

రుణమాఫీతో రైతుల్లో ఆనందం-పిఏసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్…

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు రథం బహుకరణ

Sambasivarao