Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివ నగర్ లో కిశోర బాలికల పోషణ అవగాహన కార్యక్రమం

*ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివ నగర్ లో కిశోర బాలికల పోషణ అవగాహన కార్యక్రమం* 

 

వరంగల్ జిల్లా//శివనగర్ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వరంగల్ ప్రతినిధి:-

 

ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్ నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆశాదేవి మరియు రమాదేవిల ఆధ్వర్యంలో కిషోర్ బాలికలకు పోషణ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆశాదేవి మాట్లాడుతూ కిశోర బాలికలు ఈ వయసులో పోషకాహార లోపాలతో బాధపడుతుంటారని అందుకే కేంద్ర ప్రభుత్వం పోషణ మాసం సందర్భంగా నెల రోజులపాటు అన్ని వర్గాల ప్రజలకు పోషకాల పట్ల అవగాహన కల్పించాలని అందులో భాగంగా పాఠశాలలోని మహిళా విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆశాదేవి మాట్లాడుతూ కిశోర బాలికలకు రక్తహీనత ప్రధాన సమస్యగా ఉంటుందని దాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన పోషకాలను తెలియజేశారు అలాగే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు మరొక సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ ప్రతిరోజు పల్లి బెల్లం తినాలని సూచించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గందెశ్రవణ్ కుమార్ మాట్లాడుతూ సహజంగా పెరిగే వయసులో విద్యార్థులు పోషకాహార లోపాలతో బాధపడుతుంటారని ఇలాంటి సమయంలో వారికి పోషకాహారం పట్ల సరైన అవగాహన కల్పించడం సంతోషకరమని ఇందుకు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే విద్యార్థులు ప్రతినిత్యం సరైన పోషకాహారాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ మరియు ఇతర ఉపాధ్యాయులు అంగన్వాడీలు రాజ సులోచన వనజ రమాదేవి భాగ్యమ్మ విజయలక్ష్మి ఆశా వర్కర్ సుమిత్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమ తదనంతరం విద్యార్థులు వచ్చే పోషకాహారం పట్ల ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

Related posts

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News

జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ని సన్మానించిన టీఎన్జీఓస్ నాయకులు

గీసుకొండలో రేవూరి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యులు

Sambasivarao