Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుయాత్ర ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో

*విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుయాత్ర ప్రారంభించిన ఎల్తూరి సాయికుమార్ స్వేరో*

 

హన్మకొండ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 హనుమకొండ ప్రతినిధి:-

 

 సంక్షేమ హాస్టల పరిరక్షణ విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి పోరుయాత్రను ఎస్ ఎస్ యు జెండాను ఊపి ఎల్తూరి సాయి కుమార్ స్వేరో. స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అనేకమైనటువంటి సమస్యలు నెలకొన్న సందర్భంగా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుయాత్ర అనే పేరిట హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు ప్రతి ఒక్కటి తిరిగి ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అనే ఒక సంకల్పంతోటి యాత్రను ప్రారంభించుకోవడం జరిగింది. సంక్షేమ హాస్టల్లో మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనము మరియు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆ ఒక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలా ఈ యాత్రను సెప్టెంబర్ 20నుంచి 30 వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతోంది కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విద్యార్థి పోరు యాత్రను విజయవంతం చేయగలరని హనుమకొండ జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గజవెల్లి శ్రావణ్, చెట్టుపల్లి శివకుమార్, రవి, సిద్దు, అన్వేష్, నరేష్, సాయి, బాబు, మహేష్, తరుణ్, మనోహర్ మరియు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌

కుట్టు మిషన్లను పంపిణీ