Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి

*తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి*

సాయుధ పోరాట వారసత్వం సిపిఐ పార్టీదే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్.

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//ఇల్లంద

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వర్ధన్నపేట ప్రతినిధి:-

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి అరెల్లి రవి అధ్యక్షత వహించగా సీపీఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే భాషమియ పతాకావిష్కరణ చేసిన అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో 4500 మంది యువకిశోరాలు తమ ప్రాణాలను తునప్రాయంగా పెట్టి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి దూరల భూస్వాముల పటేల్ పట్వారి పెత్తందారుల ఆగడాలను అరికట్టి తెలంగాణను విముక్తి చేసిన పార్టీ సిపిఐ అని అన్నారు. ఈ చరిత్ర లేని బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీ మతతత్వ ఉద్యమంగా చిత్రీకరించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఏనాటికి నమ్మరని, తెలంగాణ సాయుధ పోరాటం అన్ని వర్గాల ఐక్యతతో సాగిన పోరాటం అని ఆ పోరాట చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పార్టీ అంశాల్లో చేర్చాలని తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మృతి చిహ్నాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలని సాయుధ పోరాట అమరవీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పైఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో,గన్నారపు రమేష్, సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, గన్నరపు రమేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మియాపురం గోవర్ధన్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి దామెర కృష్ణ, కడమంచి యాదగిరి, అక్బర్, సారయ్య సాయిలు, యాకూబ్ తెలంగాణా ప్రజా నాట్య మండలి వారిచే విప్లవ గీతాలు ఆలపించారు.

Related posts

తెలంగాణ ఉద్యమకారుల బస్సు చైతన్య యాత్ర

తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య జిల్లా స్థాయి కార్యవర్గ ఎన్నికలు

గోపాల నవీన్ రాజుని కలిసిన టీబీసీపీస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్

Sambasivarao