Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పరకాల ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అందని ద్రాక్షగా మారింది ఎస్ఎఫ్ఐ నాయకుల

*పరకాల ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అందని ద్రాక్షగా మారింది ఎస్ఎఫ్ఐ నాయకుల* 

హన్మకొండ జిల్లా//పరకాల

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 పరకాల ప్రతినిధి:-

పరకాల పట్టణంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పర్యటన చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పరకాల పట్టణంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ సంవత్సరం గడుస్తున్న బిల్డింగ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం జరిగింది ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలి విద్యార్థులు క్లాస్ రూములు సరిపోక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు ఇప్పటికైనా గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మరియు కాంట్రాక్టర్ బిల్డింగ్ నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో చెప్పాలన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రస్థాయి సీఎం కప్ యోగా పోటీలకు పత్తిపాక విద్యార్థులు     

ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం