Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బాధిత కుటుంబానికి 8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

*బాధిత కుటుంబానికి 8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత* 

వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం//16 చింతల్ తండా

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 నర్సంపేట ప్రతినిధి:-

చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి అండగా నిలిచారు.. 16 చింతల తండా గ్రామంలో ప్రేమోన్మాది నాగరాజు దాడిలో తల్లిదండ్రులు బాణోత్ శ్రీను సుగుణలను కోల్పోయిన పిల్లలు దీపిక మదన్ లకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అండగా నిలిచారు. ఆనాటి ప్రేమోన్మాది హత్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను పరామర్శించినపుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం నిధి నుండి 8 లక్షల రూపాయలను చెక్కు రూపములో నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సర్వం కోల్పోయిన పిల్లలకు అందించారు. అనంతరం దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ తల్లితండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు మరియు వారి రక్షణకు ప్రభుత్వం భాద్యత తీసుకుని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అన్నారు. పిల్లలకు భవిష్యత్తులో పై చదువుల నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం పిల్లలు మాట్లాడుతూ మా కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెళ్లి దేవేందర్ రావు ఏసీపీ కిరణ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బాణోత్ రమేష్ నాయక్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మాజీ ఎంపిపి కేతిడి వీరా రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధన రమేష్ మాజీ ఎంపీటీసీ జిల్లా మహిళ కార్యదర్శి రమాబాయి మైబూసింగ్ రాథోడ్ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ మండల ఉపాధ్యక్షులు భూక్య మోహన్ నాయక్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్ నాయకులు లాల్ సింగ్ ధన్సింగ్ నాయక్ సూఖ్య శంకర్ కిషన్ మాణిక్యాం తండా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సు నాయక్ మాజీ ఉప సర్పంచ్ నర్సింహ రావులు వెంకన్న యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు

Sambasivarao

ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత

Sambasivarao