Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అక్రమంగా నాటు సార రవాణా చేస్తు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

*అక్రమంగా నాటు సార రవాణా చేస్తు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు* 

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//జాన్ పాక్ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 వరంగల్ ప్రతినిధి:-

అక్రమంగా నాటు సార రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై జ్యోతి. గీసుగొండ మండలంలోని జనుపాక వద్ద ఎక్సైజ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు వాహనాల తనికి నిర్వహించగా సంగెం మండలం నల్లబెల్లి పరిదిలోని తూర్పు తండా గ్రామానికి చెందిన బానోట్ అనిత, అజ్మీర్ భిక్షపతి తండ్రి మంజ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనాల తనికిలో 11 లీటర్ల నాటు సార పట్టుకున్నారు అనంతరం పట్టుకున్న వాహనాన్ని పరకాల ఎక్సైజ్ పోలీస్ స్టేషనుకి తరలించినట్లు తెలిపారు పట్టుకున్న వారిని గీసుగొండ ఎమ్మార్వో కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై వై జ్యోతి కానిస్టేబుల్ దిలీప్. అఖిల్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

ఎస్జీటీలపై చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం

ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం: వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

ఇకనుంచి ఆపదలో మీ నేస్తం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.