Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపిలో సభ్యులు అవ్వండి:


(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు సెప్టెంబర్ 22)
ఆత్మకూరు మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ లలో 200 కు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనీ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి,, మండల సభ్యత్వ ప్రముఖ్ ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి బిజెపి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని పెంచికలపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని కొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ… ఇప్పుడు అధికారం లో ఉన్న పార్టీ నీ చూస్తున్నామని, రాష్ర్ట అభివృద్ది నీ కుంటుపడేలా చేస్తున్నారని, 2047 వరకు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని లక్ష్యం తో ప్రధాని మోడీ  పని చేస్తున్నారన్నారని అన్నారు.భారతీయ జనతా పార్టీలో చేరేందుకు యువకులు చాలామంది ఉత్సాహం చూపు తున్నారని మన మండలంలోని అన్ని గ్రామాలలో యువకుల దగ్గరికి పోయి హిందూ ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకున్న బీజేపీకి సపోర్ట్ గా ఉండాలని కోరడం జరిగింది కులాలకు మతాలకు అతీతంగా అందరూ బిజెపి సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారుఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మండల సభ్యత్వ ప్రముఖ్ ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి ఓబిసి హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల రవి బూత్ అధ్యక్షులు ఇలాసరపు రత్నాకర్ బొల్లికొండ వెంకటేశ్వర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి

రైతులతో ముచ్చటించిన ఎస్సై అశోక్

Jaibharath News

పదవ తారీకులోపు మొదటి దశలో మంజూరైన రుణమాఫీ నిధులను రైతులకు అందజేయాలి