, జై భారత వాయిస్,,,కంబదూరు ,,,మండల కేంద్రం లోని కమల మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో కురుబ సంఘం మండలాధ్యక్షుడు వెంకటంపల్లి రామకృష్ణ సభాధ్యక్షతన ఆదివారం కురుబ కుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజినేయులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ కురుబ సంఘం అధ్యక్షుడు కామక్కపల్లి నాగరాజు,ఐదుమండలాల కురుబ సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు.ఈ సందర్భంగా బోరంపల్లి ఆంజినేయులు మాట్లాడుతూ ప్రతి కురుబకుల సోదరుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే కుల సంఘ సభలకు విరివిగా తరలి వచ్చి ఐక్యతను చాటుకోవాలన్నారు. కుల సోదరుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే ప్రతి రాజకీయపార్టీగుర్తిస్తుందనిఆయనఅన్నారు.కళ్యాణదుర్గంనియోజకవర్గ కేంద్రంలో కనకదాసు కళ్యాణమండపం తో పాటు కనకదాసు విగ్రహాన్ని నెలకొల్పుటకు కార్యచరణ చేయనున్నామని ఆయన చెప్పారు.కుల సోదరులు ఉన్న ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో సర్పంచి లు,ఎంపిటిసిలు,జడ్పీటీసీల స్థానాలకు టికెట్ సాధించుకోవడాని కోసం సంఘం ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండలం లోని కురుబ కుల సోదరులు హజరయ్యారు..
